NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ అమ్మవారికి శుక్రవారం ఉదయం అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రానికి ఎదురుగా గల రహదారికి కుడి వైపున ఉత్తరముఖంగా అంకాలమ్మ అమ్మవారి ఆలయం ఉంది. ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని దేవీభాగవతంలో చెప్పబడింది. ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. దైవశక్తి సమాజంలో ఏదో కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని తెలియజెప్పే మన విశిష్ట సంస్కృతి యొక్క ఉదాత్త వైఖరికి తార్కాణంగా ఈ గ్రామదేవత ఆరాధనను పేర్కొనవచ్చు. మహాగణపతి పూజ అనంతరం అమ్మవారికి పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గందోదకం, పుష్పోదకం, విశేషఅభిషేకం పూజలను నిర్వహించారు. అర్చకస్వాములు కోవిడ్ నిబంధనలతో భౌతికదూరాన్ని పాటిస్తూ అంకాళమ్మ అమ్మవారికి ఈ విశేషార్చనలు నిర్వహించారు అని ఈవో రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author