PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో విశేష రుద్రాభిషేకాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జయ గురుదత్త శ్రీ గురుదత్త మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గౌరీ శంకర స్వామి వారికి ప్రాతఃకాలం నుండి విశేష పంచామృత అభిషేకాలు విశేష రుద్రాభిషేకాలు అర్చనలు జరిగినవి. మరియు నవగ్రహ, లక్ష్మీ గణపతి, మూల మంత్ర సహిత, అఘోర పాశుపత హోమము మరియు లలిత సహస్రనామ హోమములు జరిగినవి. ప్రదోషకాలంలో గౌరీ శంకర స్వాముల వారికి రుద్రాభిషేకాలు రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకములు జరిగినవి. ఇందులో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.

About Author