ఎస్సీ బాలికల వసతి గృహం ఆకస్మికంగా తనిఖీ
1 min read– క్షేత్ర స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం పట్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది..
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణం ఎస్సీ బాలికల వసతి గృహాన్ని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం విద్యార్థిని లతో హాస్టల్ లోని సమస్యలనుస్వయంగాఅడి గితెలుసు కున్నారు.బాలికలకు బాత్ రూం సౌకర్యం లేక ఆరుబయటే స్నానాలు చేస్తున్నాం అని ఎమ్మెల్యే దృష్టికి బాలికలు తీసుకొని పోవడం తో వెంటనే జిల్లా కలెక్టర్ కు హాస్టల్ వార్డెన్ వనజాక్షి మీద పిర్యాదు చేశారు.అలాగే టాయ్ లెట్స్ లలో నీరు రాకపోవడం,మెను ప్రకారం భోజనం,టిఫిన్ లు పెట్టకపోవడం,స్థానికంగా ఇక్కడ హాస్టల్ వార్డెన్ విధులు నిర్వర్తించ పోవడం కూడా ఎమ్మెల్యే దృష్టికి బాలికలు తీసుకు రావడం తో హాస్టల్సిబ్బందిమీదఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గం లో నీ అన్ని హాస్టల్ లను తాను తరచూ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరుగుతుంది అని వీధుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం తాను సహించే ప్రసక్తే ఉండదు అని కాబట్టి నియోజకవర్గం లోని అన్ని శాఖలకు చెందిన అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు.జగనన్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యా,వైద్య రంగాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంటే స్థానికంగా క్షేత్ర స్థాయిలో మాత్రం అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం తో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతుంది అని అధికారుల పట్ల ఎమ్మెల్యే కాటసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్య ధోరణి పై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఎవరు కూడా తనిఖీలు చేయడం లేదని కలెక్టర్ కు తెలిపారు.పదవ తరగతి, ఇంటర్చదివేబాలికలునీరురాకపోవడం,మౌలిక వసతులు లేకపోవడం తో ఆరుబయటే స్నానాలు చేయడం చాలా దురకష్టకరమైన విషయం అని చెప్పారు.ఈ కార్యక్రమం లో అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, కైప ప్రతాప్ రెడ్డి,చెర్వుపల్లే పుల్లయ్య,అంబటి రవి కుమార్ రెడ్డి ,ఎస్సై లు పాల్గొన్నారు.