PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడల వల్ల స్నేహ సంబంధాలు మెరుగవుతాయి

1 min read

నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ బేగ్..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు లోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నంద్యాల జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 17.. 14 బాలుర టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ రెండవ రోజు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ బేగ్, శ్లోక స్కూల్ కరస్పాండెంట్ సూది రెడ్డి శ్రీధర్ రెడ్డి, బసిరెడ్డి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ లాయర్ సత్యనారాయణ, నంద్యాల జిల్లా శాప్ కో- ఆర్డినేటర్ స్వామిదాసు రవి కుమార్,నందికొట్కూరు మార్కెట్ యార్డ్  డైరెక్టర్ జలీల్ అహ్మద్ హజరై అండర్ 17 కబడ్డీ సెలక్షన్స్ ను  లాంఛనంగా ప్రారంభిం చారు. అనంతరం అథ్లెటిక్స్ మరియు షటిల్ బ్యాడ్మింటన్ లో విజేతలకు అతిథులు ట్రోఫీ మరియు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గ స్కూల్ గేమ్స్ కో-ఆర్డినేటర్ డోరతి, నందికొట్కూరు మండల కో-ఆర్డినేటర్ వీరన్న, పగిడ్యాల మండల కో-ఆర్డినేటర్ కృష్ణ, మిడుతూరు మండల కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, జూపాడు బంగ్లా మండల కో-ఆర్డినేటర్ శ్రీనివాసులు, పాములపాడు మండల కో-ఆర్డినేటర్ నాగరాజు, కొత్తపల్లి మండల కో-ఆర్డినేటర్ మురళి నాయక్, ఫిజికల్ డైరెక్టర్లు చంద్రమోహన్, సుంకన్న, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ శ్రీధర్ కుమార్, రాగన్న జయమ్మ, అరుణ, రాజేశ్వరి, జస్సింతాదేవి, విజయకుమారి, స్వరూప, చెన్నమ్మ, సుమలత, సైదానిబీ తదితరులు పాల్గొన్నారు.

About Author