క్రీడలు యువత ఐక్యతకు సంకేతం
1 min read– క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, స్నేహభావాన్ని పెంపొందిస్తాయి: కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: విద్యార్థులు, యువత చెడు మార్గాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే క్రీడలను ప్రోత్సహించాలని క్రీడలు యువత ఐక్యతకు సంకేతం అని అడ్వకేట్ వెంకటేష్ అన్నారు. మండల కేంద్రమైన గోనెగండ్ల లోని ఎస్సీ కాలనీ లోని యువకులు సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని గుల్ల మరుసు నాగరాజు నిర్వహణలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ పోలకల్ వెంకటేష్ మాట్లాడుతూ యువత క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చెడు మార్గాలకు దూరంగా ఉండాలని,అలాగే యువత క్రీడలు ఆడటం వల్ల ఐక్యతకు సంకేతం గా నిలుస్తారన్నారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, స్నేహభావాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయన్నారు. ఒక్కరికి కృషి, పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చని,క్రీడల ద్వారా క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. అనంతరం క్రికెట్ పోటీల యందు విజేతగా నిలిచిన విజేత టీం సభ్యులకు మొదటి బహుమతిని అడ్వకేట్ పోలకల్ వెంకటేష్ 5016/- రూపాయలను, రన్నర్ గా నిలిచిన ఆర్ సి బి టీం సభ్యులకు కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్ చేతుల మీదుగా రెండవ బహుమతిని అందజేశారు. అనంతరం ఈ కార్య నిర్వహణలో మొదటి బహుమతి దాతగా అడ్వకేట్ వెంకటేష్, రెండవ బహుమతి దాత డేవిడ్ లను క్రీడాకారులు శాలువా పూలమాలతో సత్కరించారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులను క్రీడాకారులను అభినందించారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు నాగేష్, నాగేంద్ర, నరసన్న, రవి, నరసింహుడు, సోమన్న, హరికృష్ణ, యుగంధర్, అశోక్ ,నాని ,తేజ తదితరులు పాల్గొన్నారు.