NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి పట్టణంలోని  శ్రీ సరస్వతీ శిశు మందిరం అధ్వర్యంలో పట్టణంలో రెండు చోట్ల ఉట్టి కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు డి రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కింది గేరిన ఖాజా బందెనవాజ్ స్వామి గుడి దగ్గర ఒకటి ఎల్ సి  హనిమి రెడ్డి , బిసి విజయకుమార్  పూజ చేశారు. బస్టాండ్ సమీపానా మరొకటి నూకల రవి కుమార్ దంపతులు మరియు పార్థసారథి , జితేంద్ర నాథ్  పూజ గావించిరి. ఉట్టి కార్యక్రమం దగ్గర పూర్వ విద్యార్థి దిలీప్  మరియు పెన్షనర్స్ సంఘం వారు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చిన్నపిల్లల కోలాటం, చెక్కభజన, మరియు ఘోష్ తో శోభయాత్ర ప్రారంభించారు. ప్యాపిలి పట్టణ పురావీధుల గుండా శోభయాత్ర కొనసాగింది.ఈ కార్యక్రమాన్ని ఆచార్యులు, పిల్లలు జయప్రదం చేశారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author