NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాఠశాలకు ఇన్వర్టర్,శుద్ధజల నీటి యంత్రం పంపిణీ..

1 min read

పూర్వ విద్యార్థుల సహకారం..

నందికొట్కూరు, న్యూస్​ నేడు  : తాము చదువుకున్న పాఠశాలకు ఏదో ఒక విధంగా సహకారం అందించాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులు పాఠశాలకు తమ వంతుగా తోడ్పాటును అందించారు. నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలోని వేల్పనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 1999-2000 సంవత్సరం పూర్వ విద్యార్థులు చదువుకున్నారు.పూర్వ విద్యార్థులు పంచాయితీ కార్యదర్శి నూరుల్లా,శ్రీకాంత్ రెడ్డి, మాబాష,మద్దిలేటీ,మద్దిలేటి, గౌస్,కృష్ణ,శ్రీను తదితరులు కలిసి పాఠశాలకు వెళ్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణకు 40 వేలు విలువచేసే ఇన్వర్టర్ మరియు శుద్ధ జల నీటి యంత్రాన్ని అందజేశారు.పాఠశాలకు తమ వంతుగా వివరాలను అందజేయడం పట్ల హెడ్మాస్టర్ పూర్వపు విద్యార్థులను అభినందించారు.

About Author