శ్రీలంక ప్రధాని రాజీనామా !
1 min read
పల్లెవెలుగువెబ్ : శ‌్రీలంక ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా చేశారు. ప్రజాందోళనలు తీవ్రం కావడం, విపక్షాల నిరసనలు తీవ్రం కావడంతో ఆయన రాజీనామా చేశారు. రాజపక్సతో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం రాజపక్స పేరిట ప్రకటన వెలువడింది. శ్రీలంక ప్రజలు తీవ్ర భావోద్వేగంతో ఉన్నారని, హింసతో సాధించేది శూన్యమన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఆర్ధిక సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని రాజపక్స ఆశాభావం వ్యక్తం చేశారు.