భక్తుల కోర్కెలు తీర్చే పొలతల శ్రీ మల్లేశ్వర స్వామి
1 min read– ప్రత్యేక పూజలతో కార్తీక మాస వైభోత్సవం
పల్లెవెలుగు, వెబ్ కడప: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వైయస్సార్ కడప జిల్లా లోనే కాకుండా రాష్ట్రం లోనే ప్రసిద్దగాంచిన మహా పుణ్య శైవ క్షేత్రం శ్రీశ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ( పొలతల) ను జిల్లాలో ప్రజలు దర్శించుకుని ఆ దేవదేవుని కటాక్ష సన్నిధిలో పునీతులు కాగలరని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి మహేశ్వర్ రెడ్డి తెలిపారు, ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మహా శైవ క్షేత్రాలలో ఒకటైన (పొలతల ) ఇక్కడ మహాశివునికి, అమ్మవార్లకు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు గావిస్తారని, భక్తులు విరివిగా శ్రీశ్రీ (పొలతల) మల్లేశ్వర స్వామిని దర్శించుకుననే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ ఆయన అన్నారు, కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి, పుణ్య ప్రాప్తి కలుగుతుందని ఆయన అన్నారు, ఇప్పటికే పొలతలకు ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించడమే కాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా7వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఏడు గంటలకు జాలాతోరణం,14వ తేదీన తేది మూడో సోమవారం ఉదయం 9-30 గంటలకు శివపార్వతుల కళ్యాణమహోత్సవం, సాయంత్రం 4 గంటలకు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్ల కృప కటాక్షానికి పాత్రులు కాగలరని ఆయన అన్నారు.