శ్రీ సత్యసాయి త్రాగునీటి పధకం నిర్వహణ పనులను పకడ్బందీగా చెయ్యాలి
1 min read
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
త్రాగునీటి పథకాలలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా అధికారులు చూడాలి
రోడ్డు నిర్మాణ పనులలో త్రాగునీటి పైప్లైన్లు దెబ్బతినకుండా చూడాలి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : గురువారం జిల్లా కలెక్టరేటు గౌతమి సమావేశ మందిరంలో శ్రీ సత్యసాయి త్రాగునీటి పధకం నిర్వహణ పనులపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లాలో శ్రీ సత్యసాయి త్రాగునీటి పధకం గోపాలపురం, పోలవరం, చింతలపూడి,కొవ్వూరు నాలుగు నియోజక వర్గాలలో 14 మండలాలు 158 గ్రామాల్లో 3.75 లక్షల జనాభాకు ఉపయోగపడే స్కీమ్ ను మండలాలు వారీగా ఆపరేషన్ మెయింటెన్స్ మీద జిల్లా కలెక్టరు సమీక్షించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలోని మెట్ట మండలాలలో ప్రజల దాహార్తిని తీరుస్తున్న శ్రీ సత్యసాయి త్రాగునీటి పధకం నిర్వహణను పకడ్బందీగా చేయాలన్నారు. త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని. త్రాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులలో ఆర్ డబ్ల్యూ ఎస్ మరియు శ్రీ సత్యసాయి త్రాగునీటి నీటి పైపు లైన్లు వివరాలను ముందుగానే సంబంధిత రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లకు తెలియజేయాలని, రోడ్ల నిర్మాణ సమయంలో పైపులైన్లు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్తు సిఇవో కె.భీమారావు, ఆర్డబ్ల్యూయస్ యస్ఇ జి.త్రినాథ్ బాబు,నీటిపారుదల శాఖ యస్ఇ పి.నాగార్జున రావు,జిల్లా పంచాయతీ శాఖ అధికారి కె.అనురాధ, ట్రాన్స్ కో యస్ఇ సాల్మన్ రాజు,ఆర్ &బి శాఖ ఇఇ వై.వి.యస్.కిషోర్ బాబు, ప్రభృతులు పాల్గొన్నారు.
