ఘనంగా శ్రీ ఉల్లిగమ్మ దేవి, కుంభోత్సవ వేడుకలు
1 min read

హొళగుంద న్యూస్ నేడు : మండల కేంద్రంలో, రజక సంఘం అధ్వారంలో శ్రీ ఉలిగాంబిదేవి, కుంభ ఉత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి శ్రీ ఉలిగాంబిదేవి దేవాలయం నుంచి, స్థానిక బస్టాండ్లో ఉన్న పెద్ద బావి దగ్గర గంగి పూజ చేసి మేళ తాళాలతో ఊరేగింపుగా నిర్వహించారు దేవాలయంలో కుంభాన్ని ప్రతిష్టించి దేవికి పూలతో ఆకులతో నాలంకరణ చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు మంగళహారతి పూజలు నిర్వహించారు దేవికి నైవేద్యం సమర్పించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు వచ్చిన భక్తాదులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు ఉల్లిగమ్మ, దేవి భక్తాదులు పాల్గొన్నారు.

