NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సరైన సమయానికి విద్యార్థి బస్సులను నడపండి   

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు: సరైన సమయానికి విద్యార్థి బస్సులు నడపాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ ఆర్టీసీ అధికారులను కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సరైన సమయానికి ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆదోని  నుంచి పత్తికొండ అదేవిధంగా పత్తికొండనుంచి ఆదోనికి నడుపుతున్న ఆర్టీసీ బస్సులను సరైన సమయపాలన పాటించినందును వేలాదిమంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళలేని స్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు విద్యార్థి బస్సులను సరైన సమయానికి నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల నుండి బస్సు పాసు చార్జీలను మాత్రం సరైన సమయానికి కట్టించుకుంటున్నారు కానీ విద్యార్థి బస్సులను మాత్రం సరైన సమయానికి  నడపడం లేదని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఆర్టీసీ రవాణా శాఖ ముఖ్యపాత్ర పోషిస్తుందని అయితే ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఎంతోమంది విద్యార్థులు చదువులను మానేయాల్సిన దుస్థితి నెలకొందని గుర్తు చేశారు. ఇప్పటికైనా విద్యార్థి బస్సులకు సమయపాలన పాటించి అధిక సర్వీసులను ఏర్పాటు చేయాలని కోరారు. లేనియెడల విద్యార్థులందరిని సమీకరించి ఆర్టీసీ డిపోలు ముట్టడిస్తామని హెచ్చరించారు.

About Author