ఇండియాకు స్టాగ్ ప్లేషన్ ముప్పు : కౌశిక్ బసు
1 min read
పల్లెవెలుగువెబ్ : భారత ఆర్థిక వ్యవస్థ స్టాగ్ ప్లేషన్ ప్రమాదానికి చేరువలో ఉందని ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థిక వేత్త కౌశిక్ బసు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండి .. ఆర్థిక వ్యవస్థలో ఎదుగూ బొదుగూ లేని స్థితిని స్టాగ్ ప్లేషన్ అంటారు. కొవిడ్ కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నా, అది కొద్ది రంగాలకు మాత్రమే పరిమితం అయిందని బసు అన్నారు. సగం ఆర్థిక వ్యవస్థ ఇంకా మాంద్యంలోనే ఉందన్నారు. కొవిడ్‌కు ముందే యువతలో 23 శాతం మందికి చేసేందుకు పని లేదని చెప్పారు. ప్రపంచంలో మరే దేశంలోనూ నిరుద్యోగ రేటు ఈ స్థాయిలో లేదన్నారు.