రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి ప్రస్తుతం జిల్లాలలో ఉన్న వంటగ్యాస్ అందుబాటు మరియు అకాల వర్షాలు కురిసిన నేపథ్యంలో పరిస్థితుల వివరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మరియు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరై జిల్లాలో వంటగ్యాస్ అందుబాటులో ఉన్న విషయాలు మరియు జిల్లా లోని కొన్ని మండలాలు పత్తికొండ , హాలహార్వి,మద్దికేర, తుగ్గలి ల లో కురిసిన వడగండ్ల వాన ల విషయాలు వివరించారు.


