PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

21న గుండె వైద్యనిపుణులతో..రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు..

1 min read

కర్నూలు మెడికల్​ కళాశాలలో ​ఏపీ సీఎస్ఐ ఆధ్వర్యంలో వైద్యవిద్యార్థులకు​ అవగాహన

  • ఏపీ సీఎస్ఐ కమిటీ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డా. చంద్రశేఖర్​​​

పల్లెవెలుగు,కర్నూలు:గుండె వైద్య చికిత్సలో నూతన మార్పులు…వైద్య విధానాలు..రోగుల హృదయాలపై పరిశోధన తదితర అంశాలపై ప్రపంచ స్థాయి గుండె వైద్య నిపుణులతో వైద్యవిద్యార్థులకు రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ కార్డియాలజి సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డా. చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరి డా.ఎ.వసంత కుమార్ తెలిపారు. బుధవారం కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.  కర్నూలు మెడికల్ కళాశాలలో ఈ నెల 21,22,23వ తేదీల్లో ​ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన గుండె వైద్య నిపుణులు, బోధకులతో వైద్యులకు, పీజీ విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2013లో కర్నూలు మెడికల్ కాలేజిలో ​ ప్రపంచస్థాయి వైద్యనిపుణులతో సదస్సు నిర్వహించామని, ఈ ఏడాది రెండో సారి అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

డా. చంద్రశేఖర్ కు ‘ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు’

ఆంధ్ర ప్రదేశ్ కార్డియాలజి సొసైటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో కార్డియాలజిపై జరిగే  రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరి డా. అనురాధ, ​కార్డియాలజి సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డా.పి.సి. రత్, కర్నూలు కలెక్టర్ జి.సృజన ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎస్ ఐ నేతృత్వంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కార్డియాలజి విభాగపు అధిపతి డా. చంద్రశేఖర్ కు  లైఫ్​ టైమ్ అచీవ్​ మెంట్​ అవార్డు ప్రధానం చేయనున్నట్లు ఏపీ సీఎస్​ఐ ఆర్గనైజింగ్​ సెక్రటరి డా. ఎ.వసంత కుమార్ తెలిపారు. సమావేశంలో ఏపీ సీఎస్ఐ కర్నూలు కమిటీ వైస్ ప్రెసిడెంట్ డా.లలిత, డా.నిఖిత,డా. రామేశ్వర రెడ్డి, సైంటిఫిక్ కమిటీ మెంబర్లు డా.ఎండి ఆలీ, డా. కిరణ్ కుమార్, డా. హితేష్ , డా. తేజానంద రెడ్డి, ట్రెజరర్లు డా. ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

About Author