రాష్ట్ర స్థాయి మహాసభలు జయప్రదం చేయండి
1 min read– RVF జిల్లా అధ్యక్షులు బత్తిని ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శి రియాజ్.
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: విద్యార్ధుల , యువకుల సమష్యలపై పార్టీలకు అతీతంగా రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ (ఆర్.వి.ఎఫ్) గత 9 సంవత్సరాలుగా స్వతంత్రంగా పోరాటం చేస్తున్నామని, అందులో భాగంగానే నవంబర్ 21 , 22 తేదీలలో ఆర్వీఎఫ్ రాష్ట్ర మహాసభలు ఎమ్మిగనూరు పట్టణంలో అట్టహాసంగా జరపనున్నట్టు మహాసభల సందర్బంగా శుక్రవారం నాడు పాణ్యంలో ఆర్వీఎఫ్ రాష్ట్ర మహాసభల కరపత్రాలను స్ధానిక గాంధీ సర్కిల్లో విడుదల చేశారు.ఈ సందర్బంగా రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్) నంద్యాల జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు బత్తిని ప్రతాప్ , రియాజ్ లు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత సమష్యలపై – సీమకు జరుగుతున్న అన్యాయంపై 2013న నంద్యాలలో ఆర్.వి.ఎఫ్ ఆవిర్భవించిందనీ , ఈ 9 సంవత్సరాల కాలంలో సీమలోని అనేక సమష్యలపై ఆర్వీఎఫ్ పోరాటం చేసి విజయం సాధించిందన్నారు. వచ్చేనెల 21 22 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి మహాసభలను విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో నేతలు సుధీర్ , అమరరాజు , శ్రీను , మణితేజ , భరత్ , నవీన్ తదితరులు పాల్గొన్నారు.