ఉద్యోగిపై చర్యలకు రాష్ట్ర లోకాయుక్త ఆదేశం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: మాజీ ప్రభుత్వ ఉద్యోగికి తెలుపు రేషన్ కార్డు మంజూరు చేసిన తహశీల్దార్ పైక్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి ఆదేశించారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగి పై నందిగామ స్టేషన్లో ఐపిసి .420 కేసు నమోదు చేశారని సామాజిక కార్యకర్త జంపానశ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన తెలియజేశారు . గౌ” సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రకారం (రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ సివిల్ నెంబర్ 196/2001) విరుద్ధంగా నందిగామ నగర పంచాయతీ పరిధిలోని వైద్య ఆరోగ్యశాఖ మాజీ ప్రభుత్వ ఉద్యోగి డ్రైవర్ ఎం. చంద్రమౌళికి తెలుపు కార్డు మంజూరు చేసినందుకు గాను రెవెన్యూ అధికారులను గుర్తించి లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా డిసెంబర్ 29 -2022 ఉత్తర్వులుజారీ చేశారు. ఫిబ్రవరి 7వ తేదీ 2020తేదీన కృష్ణా జిల్లా ఉయ్యూరు చెందిన సామాజిక కార్యకర్త జంపానశ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు మేరకు నిరుపేదలకు ఇవ్వవలసిన తెలుపు రేషన్ కార్డు అనర్హులకు ఇచ్చినందుకు మాజీ ప్రభుత్వ ఉద్యోగి డ్రైవర్ రూ,34 ,070 పెన్షన్ ప్రతినెల పొందుతున్న ఉద్యోగికి తెలుపు రేషన్ కార్డు మంజూరు చేసినందుకు గాను ఐపిసి .420 కేసు నమోదు అయిందని ఓ ప్రకటన జంపానశ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.