భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. 4 లక్షల కోట్లు ఆవిరి !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్చి నెలలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉన్నట్టు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడంతో సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. చమురు ధరలు పెరగడం, త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్ల అంచనాలకు అనుగుణంగా లేకపోవడం, రష్యా..ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం, బడ్జెట్ పై అప్రమత్తత కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. గురువారం ఒక్క రోజే 4 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. 12 గంటల సమయంలో నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో 16924 వద్ద, సెన్సెక్స్ 1215 పాయింట్ల నష్టంతో 56642 వద్ద ట్రేడ్ అవుతోంది.