భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లలో భయాందోళన !
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు బేర్స్ కంట్రోల్ లోకి వెళ్లాయి. ఉదయం నుంచి భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలహీనపడటం, ఐరోపాలో కరోన కేసులు అధికం కావడం కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఇటీవల స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన పేటీఎం సంస్థ భారీ నష్టాలతో ట్రేడ్ అవడంతో పాటు.. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన కొత్త కంపెనీల్లోకి ఎక్కువగా లిక్విడిటీ వెళ్లడంతో సూచీలపై ఒత్తిడి నెలకొంది. అదే విధంగా రిలయన్స్, సౌదీ అరామ్ కో మధ్య డీల్ కూడ రద్దయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో రిలయన్స్ షేర్ ఒత్తిడికి లోనవుతోంది. ఫలితంగా సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో సెన్సెక్స్ 1049 పాయింట్ల నష్టంతో 58586 వద్ద ట్రేడ్ అవుతోంది. నిప్టీ 305 పాయింట్ల నష్టంతో 17459 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 853 పాయింట్ల నష్టంతో 37123 వద్ద ట్రేడ్ అవుతోంది.