NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వీధులు.. వెలిగిపోవాలి…

1 min read
మాట్లాడుతున్న కలెక్టర్​ జి. వీరపాండియన్​

మాట్లాడుతున్న కలెక్టర్​ జి. వీరపాండియన్​

‘జగనన్న పల్లెవెలుగు’ను జాగ్రత్తగా అమలు చేయాలి
– అధికారులను ఆదేశించిన కలెక్టర్​ జి. వీరపాండియన్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వీధి దీపాల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు జగనన్న పల్లె వెలుగు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని.. వీధి దీపాల సమస్య ఎక్కడ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు, ఈ ఓ పి ఆర్ డి లు, ఎంపీడీఓలకు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జగనన్న పల్లె వెలుగు వీధి దీపాల నిర్వహణ బదలాయింపు కార్యక్రమం పై సర్పంచులు, ఎంపీడీఓలు, ఈ ఓ పి ఆర్ డి లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ గ్రామ, పట్టణలలో వీధిలైట్లు వెలగక పోయిన….రిపేర్ వచ్చిన వెంటనే మరమ్మతులు చేసి వీధి దీపాలు వెలిగేల చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీ లకు కలదన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి నాలుగు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, అందులో ప్రధానంగా శానిటేషన్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్ పై వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. వీధి లైట్లు వెలగడం లేదు. గ్రామంలో పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తే పంచాయతీ కార్యదర్శుల పై ఖచ్చితంగా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

About Author