మొక్కజొన్న విత్తనాలు ఆరబెడితే కఠిన చర్యలు..
1 min read– ఎస్సై నిరంజన్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం : మండలంలోని ప్రధాన రహదారులలో మొక్కజొన్న విత్తనాలు ఆరబెడితే సంబంధిత రైతులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటన ద్వారా రైతులను హెచ్చరించారు. మండల పరిధిలోని ఆయా గ్రామాలలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటను కోత కోస్తున్నారన్నారు. కోత కోసిన మొక్కజొన్న ధాన్యం విత్తనాలను ప్రధాన రహదారుల పైన ఆరబెడుతున్నారని దీంతో ప్రధాన రహదారులపై ప్రయాణించే వాహనాలు ప్రమాదాలకు గురవుతుండడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలో భాగంగా మొక్కజొన్న రైతులను హెచ్చరిస్తున్నామన్నారు. మండలంలోని ప్రధాన రహదారుల పైన గాని ఏ రోడ్డుపైన కూడా ధాన్యం ఆరబెట్టడం చేయకూడదని రైతులు తమ ధాన్యాన్ని వారి పంట పొలాల్లో గాని కళ్ళం లో గానీ ఆరబెట్టుకోవాలని అలా కాదని రహదారుల పైన ఆరబోస్తే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.