NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సాహిస్తే కఠిన చర్యలు

1 min read

మంత్రాలయం సిఐ దస్తగిరిబాబు

మంత్రాలయం న్యూస్ నేడు :  లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సాహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ దస్తగిరి బాబు హెచ్చరించారు.  సోమవారం  స్థానిక పోలీస్ స్టేషన్ లో  ఎస్ఐ మల్లికార్జున తో కలిసి మంత్రాలయం లోని లాడ్జి యజమానులు, నిర్వాహకులకు  సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాడ్జ్ లో గది తీసుకునే ప్రతి వ్యక్తి యొక్క పూర్తి వివరాలు నమోదు చేయాలి.తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు  ఆధార్ కార్డ్ , డ్రైవింగ్ లెసైన్స్ , పాస్పోర్ట్ , తీసుకొని జిరాక్స్ / స్కాన్ కాపీ భద్రపరచాలి.గది ఇచ్చిన వారి పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, వచ్చిన తేదీ & సమయం, వెళ్లిన తేదీ & సమయం రిజిస్టర్‌లో నమోదు చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు, నకిలీ గుర్తింపు పత్రాలు ఉపయోగించే వారు, లేదా అనుచిత ప్రవర్తన కలిగిన వ్యక్తులకు గది ఇవ్వకూడదు.మైనర్ బాలురు / బాలికలు అనుమానాస్పద పరిస్థితుల్లో వచ్చినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.వ్యభిచారం, జూదం, మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ కార్యకలాపాలకు  నిర్వహించరాదు. ప్రతి లాడ్జ్ లో సీసీ  కెమెరాలు పనిచేసే స్థితిలో ఏర్పాటు చేసి కనీసం 30 రోజుల వరకు ఫుటేజ్ భద్రపరచాలి.లాడ్జ్ సిబ్బంది వివరాలు కూడా పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయించాలి.విదేశీయులు గది తీసుకున్న పక్షంలో సంబంధిత చట్టాల ప్రకారం వెంటనే సమాచారం ఇవ్వాలి.రాత్రి సమయంలో గది తీసుకునే వారి వివరాలను ప్రత్యేకంగా పరిశీలించాలి.ఎటువంటి గొడవలు, అనుమానాస్పద మరణాలు, దొంగతనాలు లేదా చట్టవిరుద్ధ సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు పూర్తి సహకారం అందించాలి.లాడ్జ్ లో  శుభ్రత, అగ్ని ప్రమాద నివారణ చర్యలు మరియు అత్యవసర భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. పై సూచనలు పాటించని యజమానులపై చట్టపరమైన చర్యలు  తీసుకుంటామని హెచ్చరించారు.

About Author