NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

45వ డివిజన్ ఇన్ చార్జ్ కంచుమర్తి తులసి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

1 min read

ప్రారంభించిన జిల్లా ఇన్చార్జ్ దూలం నాగేశ్వరరావు, నియోజకవర్గం ఇంచార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జెపి)

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మరియు 45వ డివిజన్ ఇంచార్జ్ కంచుమర్తి తులసి ఆధ్వర్యంలో స్థానిక ఆదివారం పేట మార్కెట్ జంక్షన్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ చల్లటి మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్, దూలం నాగేశ్వరరావు,ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జెపి) మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా కాక జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ ఇన్చార్జులు  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి వారి యోగక్షమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దానిలో భాగంగా ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ వేసవి ని దృష్టిలో ఉంచుకొని ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక డివిజన్ లలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ పాదా చార్యులకు, వాహనదారులకు, వేలాదిమందికి మజ్జిగ, మంచినీరు, రస్నా , ద్రాక్ష , ఆరంజ్ లాంటి చల్లని పానీయాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ రియాజ్ ఆలీ ఖాన్,  మున్నుల జాన్ గురునాథ్, గుడిదేశి  శ్రీనివాసరావు, నూకపైయ్యి సుధీర్ బాబు, తూమరాడ స్రవంతి, కిలాడి దుర్గారావు, మేతర సురేష్ ,సొంగ మధు,కొల్లిపాక సురేష్ , జి.బాలా త్రిపుర సుందరి,బట్టు విజయలక్ష్మి , పిల్లా బుజ్జమ్మలు, దినేష్ ,సాయి, ప్రభు కుమార్, దుర్గారావు, శేషు, అనసూయ, జజా,రాకేష్ ,భవిత, లావణ్య , చిన్ని తదితర డివిజన్ వైసీపీ నాయకులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author