NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి.. జిల్లా ఎస్పీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ర్యాగింగ్ విషయం లో ఎవరినీ ఉపేక్షించేది లేదు… జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్… వైద్య విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని సమాజానికి ఎంతో సేవ చేయాల్సి ఉందని ఇంట్రరాక్షన్ పేరుతో జూనియర్ విద్యార్థులని ఇబ్బందుల గురి చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం కర్నూల్ మెడికల్ కాలేజీలోని మొదటి సం..వైద్య విద్యార్థులకు సీనియర్ విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు తమ విద్యలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని తమ కెరీర్ గురించి ఆలోచించాలని సూచించారు. వైద్యులకు సమాజంలో గౌరవ స్థానం ఉందని సమాజానికి మీరు సూచిక గా ఉండాలని విద్యార్థులు రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు. వైద్య విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఏవైనా సమస్యలు ఏర్పడితే మీ కాలేజీ స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు వివిధ స్థాయిల్లో సపోర్ట్ చేయడానికి అధికారులు ఉన్నారని   విద్యార్థులు నేరుగా తనకు కూడా కంప్లైంట్ చేయొచ్చని సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మూడో వ్యక్తికి తెలియకుండా మీ  సమస్యలు పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కేఎంసి ప్రిన్సిపల్ డా. చిట్టి నరసమ్మ మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థిని కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని మీ కుటుంబంలో మీ తమ్ముళ్లను చెల్లెలను ఎలా చూసుకుంటారో ఇక్కడ కూడా అలానే మద్దతు ఇవ్వాలని, అనవసరంగా విద్యార్థి దశలో సమస్యలు కొని తెచ్చుకోవద్దని ర్యాగింగ్ చట్టాలు కఠినంగా ఉన్నాయని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఏ.డి.ఎం.ఈ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్య విద్యను ఛాలెంజ్ గా  తీసుకోవాలని ఆ చాలెంజ్ పూర్తయ్యేంతవరకు చిన్న చిన్న ఆటుపోట్లను లెక్కచేయొద్దని వైద్య విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అది మరవరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లు  డాక్టర్ సాయి సుధీర్, డాక్టర్ రేణుక దేవి, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్  శేషయ్య, కాలేజి లోని వివిధ విభాగాల అధిపతులు, జూనియర్, సీనియర్ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author