వైన్స్ షాప్‌ని అకస్మిక తనిఖీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు,కోడుమూరు నియోజక వర్గం,కర్నూల్ మండలం లోని ఓ వైన్స్ షాప్‌లో అకస్మిక తనిఖీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యేకర్నూల్ మండల పరిధిలోని ఒక వైన్స్ షాప్‌లో కోడుమూరు ఎమ్మెల్యే ఈరోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా షాప్‌లో మద్యం విక్రయాల విధానాన్ని, బిల్లింగ్ ప్రక్రియను, క్యూలో నిలుస్తున్న వినియోగదారుల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు. అవసరమైన చోట సూచనలు ఇచ్చి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా మద్యం సరఫరా చేయాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే గారు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం నాణ్యతమైన మద్యం అందిస్తుందని పేర్కొన్నారు.మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో మద్యం సరఫరా, భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం కలిగించారని అన్నారు. ప్రతిపక్ష నేతలుగా అప్పట్లో పలుమార్లు ప్రశ్నించినప్పటికీ సమాధానాలు ఇవ్వకుండా దాచిపెట్టారని విమర్శించారు.వినియోగదారులు అందరూ తప్పనిసరిగా QR కోడ్ ను యూస్ చేసి, నకిలీ మద్యాన్ని అరికట్టాలని వినియోగదారులు అందరికీ సూచనలు చేశారు.రాష్ట్రంలో మద్యం ధరలు పెంచి ప్రజలపై భారం మోపడం, క్వాలిటీ లేని మద్యం సరఫరా చేయడం, సీల్డ్ బాటిళ్లలో కల్తీ జరిగిన కేసులు వరకు నమోదు అయిన విషయాన్ని గుర్తు చేశారు.

