విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
1 min read– 2 కోట్ల 80 లక్షల నిధులతో పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆర్థర్
పల్లెవెలుగు వెబ్ ,మిడుతూరు: ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు నందన వనంగా ఉన్నాయని అంతేకాకుండా అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు ఆకర్షనీయంగా తీర్చిదిద్దిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని నందికొట్కూరు శాసనసభ్యులు తోగూరు ఆర్థర్ అన్నారు.మనబడి నాడు నేడు ఫేస్ 2 కింద అయిన వివిధ తరగతి గదుల నిర్మాణానికి వివిధ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.ముందుగా మండల కేంద్రమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రహరీ గోడ,మరుగుదొడ్లు,మినరల్ వాటర్ ప్లాంట్ లకు మంజూరు అయిన 65 లక్షల నిధులతో నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.తర్వాత కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 93 లక్షల నిధులతో 8తరగతి గదుల నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. వీపనగండ్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోటి 20 లక్షల నిధులతో తరగతి గదుల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ చందాపురం భారతితో కలసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని నేను మంచిగా చదువుకున్నందునే నేను ఎస్ ఐ ఉద్యోగం నుంచి ఎస్పీ వరకు పని చేశానని అన్నారు.మీరు కూడా ఒక లక్ష్యంతో చదువుకుంటూ వెళ్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని ఆయన విద్యార్థులకు తెలియజేశారు.ఈకార్యక్రమంలో జిసిడియు సునీత,ఎంపీటీసీ కోటేశ్వరరావు,కళాశాల ప్రిన్సిపాల్,బి.శంకర్ నాయక్,కేజీబీవీ ఎస్ఓ మధుసూదనమ్మ,ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,ఎంఈఓ మౌలాలి,తహసిల్దార్ సిరాజుద్దీన్,ఈఓఆర్డి ఫక్రుద్దీన్, తలముడిపి వంగాల సిద్ధారెడ్డి,వీపనగండ్ల గ్రామ వైసిపి నాయకులు తిమ్మారెడ్డి,కడుమూరు గోవర్ధన్ రెడ్డి,దేవనూరు షరీఫ్,ఎల్లారెడ్డి,ఇనాయ తుల్లా,జాన్ మరియు తదితర పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.