విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి
1 min read– ఎమ్మెల్యే తొగురు ఆర్థర్…జడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తనిఖీ.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలం బ్రాహ్మణకోట్కూరు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్థర్ ఆకస్మిక తనిఖీ చేశారు.పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పనితీరును పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్నం భోజనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వంట నిర్వాహకులను హెచ్చరించారు. మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించాలని సూచించారు. మధ్యాహ్నం భోజనం లో అవకతవకలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గతంలో కూడా వంట ఏజెన్సీ పనితీరు పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయని ఇప్పటికైనా వంట నిర్వాహకులు పనితీరు మెరుగు పరుచుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పుల్లన్న , పాఠశాల ప్రధానోపాధ్యా యులు ముజాహిద్దిన్ పాషా , మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి , బ్రాహ్మణ కొట్కూరు యువ నాయకులు ఉదయ కిరణ్ రెడ్డి , రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.