విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి
1 min read
పుస్తక పఠనం చేయాలని,తద్వారా జ్ఞాన సముపార్జన చేసి అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి
బి.ఇందిరాగాంధీ ఎంపీడీవో(ఎఫ్ఎసి)
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మరియు భారతదేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి మరియు బాల దినోత్సవం సందర్భంగా బి.ఇందిరా గాంధీ ఎం.పీ.డీ.వో (ఎఫ్ఎసి), జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం టి. శ్రీనివాసరావు, ఎంపీపీ స్కూల్ హెచ్ఎం పి. అంజనీదేవి, శ్రీకృష్ణ గురుకులం స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.అపర్ణ, ఎంపీపీ స్కూల్ టీచర్ వి. వెంకటలక్ష్మి, శ్రీకృష్ణ గురుకులం స్కూల్ హెచ్ఎం ఆర్ బెంజిమెన్ లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటమునకు పూలమాలవేసి గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభించినారు.బి.ఇందిరాగాంధీ ఎంపీడీవో(ఎఫ్ఎసి), ఆహ్వానితులు మాట్లాడుతూ ఈ వారోత్సవాలను విద్యార్థిని విద్యార్థులు కుల,మతాల భేదం లేకుండా అందరూ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని,పుస్తక పఠనం చేయాలని,తద్వారా జ్ఞాన సముపార్జన చేసి అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కోరినారు.ఈ కార్యక్రమంనకు హై స్కూల్ సోషల్ మాస్టర్ బి. నాగరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గ్రంధాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగు గ్రంథాలయ వారోత్సవాలలో విద్యార్థిని విద్యార్థులు విరివిగా పాల్గొని గ్రంథాలయంలో నిర్వహించు వివిధ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలవాలని కోరినారు. ఈ కార్యక్రమమునకు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు,గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు హాజరైనారు.పాల్గొని వారికి బిస్కెట్ ప్యాకెట్లు,చాక్లెట్లు పంచిపెట్టడం జరిగినది.ఈ కార్యక్రమం విజయవంతం చేసి ప్రారంభించిన ఆహ్వానితులకు, పాల్గొనిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసారు.


