విదార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అకస్మాత్తుగా తలెత్తే ఆరోగ్య సమస్యలపట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ పిలుపునిచ్చారు. రాయలసీమ యూనివర్సిటీ జాతీయ సేవాపథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విదార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అని గమనించాల్సింది గా ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎం. మనోజ్ కుమార్ , (చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ – వైస్ చైర్మన్ రెడ్ క్రాస్ సొసైటీ, కర్నూల్ జిల్లా) మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో సిపిఆర్ చేసి రోగుల ప్రాణాలను ఏ విధంగా కాపాడాలో మోడల్స్ ఉపయోగించి ప్రాక్టికల్ గా చూపించారు. విద్యార్థులు చాల ఆసక్తి గా ఈ ప్రదర్శన లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటకృష్ణుడు (విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ మరియు కర్నూలు రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి) శ్రీనివాస రెడ్డి (మెడికల్ ఆఫీసర్) సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య సీ.వీ కృష్ణారెడ్డి, ఎన్ఎస్స్ కో-ఆర్డినేటర్ డా. పి. నాగరాజు, ఎన్ఎస్స్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డా.కేవి రత్నం, . శివ ప్రసాద్, డా. నాగ చంద్రుడు, డా. విజయుడు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
