కె.జి.బి.వి హాస్టల్ అధికారులతో సబ్ కలెక్టర్ సమిక్ష సమావేశం
1 min read
డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థులను బడిలోకి రావటానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, న్యూస్ నేడు: డివిజన్లో స్కూల్ డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థులను బడిలోకి రావటానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో విద్య శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ వెల్ఫేర్ , కె.జి.బి.వి హాస్టల్ అధికారులతో కలిసి సమక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… డివిజన్లో ఎక్కువగా డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి స్కూల్లో చేర్పించే విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ముగిసిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ కారణాల చేత విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. ఆ విద్యార్థులను గుర్తించి వారిని ప్రత్యేకమైన క్లాసులు నిర్వహించి వారికి పరీక్షలో ఉత్తీర్ణుల అయ్యేంతట్టుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. డివిజన్లో ఏర్పాటుచేసిన సీజనల్ హాస్టల్ ను మండల విద్యాశాఖ అధికారులు ఎప్పటి అప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నివృత్తి చేసుకోవాలన్నారు. సంక్షేమ హాస్టల్లో, విద్యాసంస్థల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిఎల్పిఒ శ్రీమతి నూర్జహాన్, డిప్యూటీ డి.ఈ.ఓ వెంకట రమణ రెడ్డి, బి.సి. వెల్ఫేర్ అధికారి రాజు కుళాయప్ప తదితర అధికారులు పాల్గొన్నారు.