NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫేస్ బుక్, గూగుల్ కు స‌మ‌న్లు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ ఆన్ లైన్ ఐటీ సంస్థలు గూగుల్, ఫేస్ బుక్ కు పార్లమెంట‌రీ స్థాయి సంఘం స‌మ‌న్లు జారీ చేసింది. పౌర‌హ‌క్కుల ప‌రిర‌క్షణ‌, ఆన్ లైన్ ఫ్లాట్ ఫార‌మ్ దుర్వినియోగం నివార‌ణ పై దృష్టి పెట్టిన పార్లమెంట‌రీ స్థాయి సంఘం.. ఆయా అంశాల పై చ‌ర్చించేందుకు గూగుల్ ఇండియా, ఫేస్ బుక్ ఇండియా సంస్థల‌కు స‌మ‌న్లు జారీ చేసింది. జూన్ 29న ఎంపీ శ‌శిథ‌రూర్ నేతృత్వంలోని ప్యానెల్ ఎదుట హాజ‌రు కావాల‌ని గూగుల్, ఫేస్ బుక్ ప్రతినిధులను కోరింది. ఆన్ లైన్ లో మ‌హిళా భ‌ద్రత ప్రత్యేక ప్రాధాన్యత‌తో పాటు, పౌర‌హ‌క్కుల‌ను ర‌క్షించ‌డం, ఆన్ లైన్ న్యూస్ మీడియా దుర్వినియోగం పై గూగుల్, ఫేస్ బుక్ సంస్థల అభిప్రాయాల‌ను సేక‌రించ‌నుంది. ఇదే అంశం పై త్వర‌లో యూట్యూబ్, ఇత‌ర సోష‌ల్ మీడియా ప్లాట్ ఫారమ్ ల‌కు పార్లమెంట‌రీ స్థాయి సంఘం నోటీసులు జారీ చేయ‌నుంది.

About Author