NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు

1 min read

వేల పసిగుండెలను కాపాడిన మనసున్న మారాజు

ఎమ్మిగనూరు , న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో కష్ట కాలంలో నేనున్నానంటూ ముందుకొచ్చి ఎన్నో సేవలు అందించి,ఎంతోమంది చిన్నారులకు పునర్జన్మ ఇస్తున్న మనసున్న మహారాజు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు 50 వ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఫ్యాన్స్ అధ్యక్షుడు వహాబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.పట్టణంలోని స్థానిక మిని శ్రీనివాస థియేటర్ నందు శనివారం  అభిమానుల సమక్షంలో థియేటర్ యజమానులు నాగిరెడ్డి,వంశీరెడ్డి లు కేక్ ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు.అనంతరం పట్టణంలోని మహాత్మా గాంధీ బ్లడ్ సెంటర్ కు రక్తదానం చేసి బ్లడ్ డోనేట్ చేశారు.ఈ సందర్భంగా నాగిరెడ్డి,వంశీరెడ్డి,వహాబ్ లు మాట్లాడుతూ..లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా పరిచయమైనా చిన్న తనంలోనే ఎవరికి సాధ్యం కాని రీతిలో గుర్తింపును సొంతం చేసుకున్నారన్నారు.4500 కు పైగా చిన్న పిల్లల గుండె ఆపరేషన్లు చేయించి కోట్ల రూపాయలను అందిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారన్నారు.రీరిలీజ్ అయిన అతడు చిత్రం వసూళ్లు మహేష్ బాబు ఫౌండేషన్ అందుతాయన్నారు. కార్యక్రమంలో సీనియర్ అభిమానులు ఆనంద్, శ్రీనివాసులు,మధు,ఫిల్మ్ ఆర్ట్ డైరెక్టర్ మణికంట,అరుణ్,సుమేద్,గిరీష్,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

About Author