ఉద్యోగుల ఆర్థిక విషయాలపై ఉద్యమిస్తాం… ఆపస్
1 min read

ఒంగోలు, న్యూస్ నేడు : ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక విషయాలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, ముఖ్యంగా 30 వేల కోట్లకు పైగా ఆర్థిక బకాయిలు విడుదల చేయడం, మూడు పెండింగ్ డి ఏ లు విడుదల చేయడం, పిఆర్సి కమిషన్ వేసి మధ్యంతర భృతి ( ఐ ఆర్) 30% ప్రకటించడం వంటి ఆర్థిక విషయాలపై కార్యాచరణ రూపొందించి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు శవన్నగారి బాలాజీ పేర్కొన్నారు. ఒంగోలు పట్టణంలో ఏ కే వీ కే కళాశాల నందు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగులు నూతన ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారని, ఒక సంవత్సరం పైగా అవుతున్నా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక ఆర్థిక విషయాలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, ఇకనైనా ప్రభుత్వం త్వరలో తీసుకుని ఉద్యోగులకు రావాల్సిన 30 వేల కోట్ల ఆర్థిక బకాయిలు విడుదలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయాలని, 12వ వేతన సవరణకు సంబంధించి వెంటనే సిట్టింగ్ జడ్జితో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, జూలై 2022 నుంచి వర్తించేలా 30% మద్యంతర మృతి (ఐ ఆర్) ప్రకటించాలని , బకాయి పడ్డ ఐదు డి ఏ లను వెంటనే విడుదల చేయాలని,సిపిఎస్ రద్దు, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ అమలు, హెల్త్ కార్డుల తో మెరుగైన వైద్యం వాటి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి అన్నారు . లేనిపక్షంలో త్వరలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలన్నింటినీ కలుపుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వారు హెచ్చరించారు.ఆపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వి సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలులో ఉన్న ఇబ్బందులను వెంటనే సరి చేసి ఎంఈఓ లు, డివైఈవోలు, డైట్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ ప్రమోషన్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఆపస్ సంఘటన కార్యదర్శి శ్రీ సిహెచ్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు యాపుల భారం తగ్గించాలని పదేపదే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా కూడా మరల ఆన్లైన్ వర్క్స్ పెంచి ఉపాధ్యాయులకు బోధన చేసే అవకాశం లేకుండా చేస్తున్నారని, ఇకనైనా బోధ నేతల పనుల నుండి విముక్తి కల్పించి బోధనకే పరిమితం చేయాలని కోరారు.ఏబిఆర్ఎస్ఎం జాతీయ సహా సంఘటన మంత్రి గుంత లక్ష్మణ్ జి మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020 అమలు చేసి ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా వికసిత భారత్ లక్ష్యంగా విద్యా విధానాన్ని తీర్చిదిద్దాలని అందులో ఉపాధ్యాయులందరూ భాగస్వామ్య0 అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో 26 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

