PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా తమ్ముడికి సపోర్ట్‌ చేయండి..

1 min read

సినిమా డెస్క్​ : ‘నా తమ్ముడు బ్రహ్మాజీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు. దయచేసి యంగ్ టాలెంట్‌ని సపోర్ట్ చేయండి’ అని నాగ శౌర్య ట్విట్టర్‌‌లో ఫన్నీ కామెంట్‌ పెడుతూ ఫోటో కూడా షేర్‌‌ చేశాడు. రీసెంట్‌గా లొకేషన్‌లో బ్రహ్మాజీతో ఉన్న స్టిల్‌ని షేర్ చేశాడు శౌర్య. ఇద్దరూ పంచెలు కట్టుకుని, నిలువు బొట్లు పెట్టుకుని నవ్వుతూ కనిపిస్తున్నారు. ఇద్దరి లుక్స్‌ డిఫరెంట్‌గాను, కాస్త ఫన్నీగాను కూడా ఉన్నాయి. శౌర్య ట్వీట్‌ కూడా నవ్వు తెప్పిస్తోంది. నాగశౌర్య ప్రస్తుతం తన ఇరవై రెండో మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో కీలక పాత్రధారులపై కొన్ని ముఖ్యమైన సీన్స్ తీస్తున్నారు. షర్లీ సేతియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇక సంతోష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో నాగశౌర్య నటించిన ‘లక్ష్య’, శౌర్య, లక్ష్మీ సౌజన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వరుడు కావలెను’ మూవీలు కూడా పూర్తి కావచ్చాయి. ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఇక నుంచి ప్రతి శుక్రవారం ఒక అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అలాగే. ఈ స్పీడు చూస్తుంటే శౌర్య ఈ యేడాది వరుస సినిమాలతో సందడి చేస్తాడని అర్థమవుతోంది.

About Author