సెయింట్ జాన్స్ లోని నేషనల్ మేనేజ్మెంట్ మీట్లో -సుప్రీమ్ కోర్ట్ అడ్వకేట్ కాకర్ల
1 min read
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో గురువారం ‘విజ్డం’ నేషనల్ మేనేజ్మెంట్ మీట్ చాల ఘనంగా జరిగింది. రాయలసీమ జిల్లాల నుంచి వందల సంఖ్యలో ఎం.బి.ఏ విద్యార్థులు పలు ఈవెంట్స్ లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీమ్ కోర్ట్ అడ్వకేట్ కాకర్ల చంద్ర శేఖర్ పాల్గొని ప్రస్తుతం మార్కెట్లో అవసరమైన మార్కెటింగ్ ఆటోమేషన్, క్లౌడ్ స్టాటిస్టిక్స్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వంటి అధునాతన విషయాలపై ఎం.బి.ఏ విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న సుప్రీమ్ కోర్ట్ అడ్వకేట్ కాకర్ల చంద్ర శేఖర్ కి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.సుధాకర్ మరియు మేనేజ్మెంట్ మీట్ కన్వీనర్ డాక్టర్ అనిల్ మెమోంటోతో సత్కరించడం జరిగింది. ప్రిన్సిపాల్ మాట్లాడుతో ఎం.బి.ఏ అనేదే ఒక సర్టిఫికెట్ కోర్స్ కాదని తమ కాలేజీలో కేసు స్టడీ ఓరియెంటెడ్గా ఎన్నో ఈవెంట్స్ జరుపుతూ కార్పొరేట్ ప్రపంచానికి వేల సంఖ్యలో మేనేజర్లను అందిచడం చాల సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
