PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ మంత్రి సురేష్​కు సుప్రీంకోర్టు ఝలక్​! పాతకేసు పునర్విచారణకు ఆదేశం

1 min read

పల్లెవెలుగువెబ్​, ఢిల్లీ: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​కు సుప్రీంకోర్టు ఝలకిచ్చింది. అక్రమ​ ఆస్తులపై ఉన్న పాత కేసును సుప్రీంకోర్టు పునర్విచారణకు శుక్రవారం ఆదేశించింది. సురేష్​ రాజకీయాల్లోకి రాకముందు ఆయన సతీమణి విజయలక్ష్మీ ఐఆర్​ఎస్​ అధికారిగా పనిచేశారు. ఈ క్రమంలో ఆక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న కోణంలో 2016లో సురేష్​ ఇంటిపై సీబీఐ సోదాలు నిర్వహించింది. సీబీఐ విచారణ నేపథ్యంలో 2017లో 22శాతం ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అంశంపై కేసు నమోదు చేశారు. దీంతో సురేష్​ దంపతులు సైతం అప్పట్లో సీబీఐ విచారణను సవాల్​ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. ఈ క్రమంలో సురేష్​ దంపతులపై ఉన్న సీబీఐ కేసు టీఎస్ హైకోర్టు కొట్టసింది. అయితే సీబీఐ సదరు కేసువిషయమై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ ఏడాది సెప్టెంబర్​ 22న తీర్పును రిజర్వు చేసింది. తిరిగి పరిశీలన జరిపిన సుప్రీంకోర్టు తాజాగా శుక్రవారం సురేష్​ ఆక్రమ ఆస్తులపై పునర్విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్​ ఆస్తులపై సీబీఐ విచారణ కొనసాగించనున్నట్లు తెలుస్తాంది.

About Author