హజ్ కమిటీ సభ్యుడిగా సూరి మన్సూర్ అలీ ఖాన్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హజ్ కమిటీలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సూరి మన్సూర్ అలీ ఖాన్‌కు చోటు దక్కింది. సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయన్ను సామాజిక కార్యకర్తల విభాగం కింద హజ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. హజ్ కమిటీ సభ్యుడిగా తనను నియమించిన సీఎం చంద్రబాబు నాయుడుకు, సేవా కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడూ ముందుంటానని ఆయన చెప్పారు.