శివవరంలో వైభవంగా సూర్య రథసప్తమి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె నుంచి మండలం శివవరం గ్రామంలో అరుదైన ,పురాతనమైన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి . ఈ దేవస్థానం వేయి సంవత్సరాల క్రితం అప్పటి తూర్పు చాళుక్య రాజులు నిర్మించారని ప్రతీతి. ఈ దేవస్థానంలో కుడివైపున కశ్యప ప్రజాపతి ఎడమవైపున ఛాయాదేవి నడుమ శ్రీ సూర్యనారాయణ కలిసి ఉండడంతో ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఆరోగ్యం భాస్కరా దిక్షేత్ అన్నట్లు రథసప్తమి రోజున శ్రీ సూర్యభగవానుని దర్శనం చేస్తే పాపకర్మలు పరిహారమై ఆయురారోగ్యాలు సంప్రార్ధిస్తాయని భక్తుల నమ్మిక. దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారినిదర్శించిపూజించుకున్నారు. ప్రతియేటా శివవరం గ్రామస్తులు కమిటీగా ఏర్పడి సూర్య జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రథసప్తమి రోజున స్వామివారికి ఉదయాన్నే ప్రత్యేక అభిషేకాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి వివిధ పూలమాలలతో అలంకరించి అర్చన చేశారు. 6 గంటల నుంచి సామూహిక ఆదిత్య హృదయ పారాయణం, సామూహిక భగవద్గీత పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చెక్కభజన కార్యక్రమం భక్తులను అలరించింది.