మరియానియం’లో టైలరింగ్ శిక్షణ కేంద్రం
1 min read
దీన సేవన సభ విమల ప్రొవైన్స్ సుపీరియర్ సిస్టర్ శిల్పా..
నందికొట్కూరు న్యూస్ నేడు: టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని దీన సేవన సభ విమల ప్రొవైన్స్ సుపీరియర్ సిస్టర్ శిల్పా అన్నారు.కర్నూలు మండల పరిధిలోని గార్గేయపురం మరియా నిలయం సాంఘిక సేవా సంస్థలో మహిళల కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం సిస్టర్ శిల్పా ప్రారంభించారు.సేవ్ ఏ ఫ్యామిలీ ప్లాన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రాజెక్ట్,విమల ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సిస్టర్ శిల్పా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు కోసం ఈ కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. ఆరు నెలల పాటు జరిగే శిక్షణకు ప్రతి ఒక్కరూ హాజరై కుట్టు శిక్షణలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు.ఈ శిక్షణ నేర్చుకున్న తర్వాత మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలని మహిళలకు సూచించారు.ఇంకా ఎవరైనా ఉంటే శిక్షణ కేంద్రానికి తీసుకురావాలని సిస్టర్ శిల్పా సూచించారు. ఈ కార్యక్రమంలో మరియా నిలయం సుపీరియర్ సిస్టర్ సురేఖ,ప్రాజెక్టు కోఆర్డినేటర్ సిస్టర్స్ సారంగా,సిస్టర్ డెబోరా మరియు మహిళలు పాల్గొన్నారు.



