NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాకు బయటపెట్టే ధైర్యం ఉంది.. మీకు ఎంక్వైరీ వేసే దమ్ముందా..?

1 min read


పల్లెవెలుగు వెబ్: నీళ్లు, నిధుల పేరుతో వేల కోట్లు దోచేసిన సీఎం కేసీఆర్ అవినీతిని బయటపెట్టే ధైర్యం తమకుందని టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. విద్యుత్ ప్రాజెక్టుల్లోనే వేల కోట్ల అవినీతి జరిగింది. అలా నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ ప్రకటించారు. హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా శిబిరంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసే డ్రామాలు ఆడుతున్నాయని.. బండి సంజయ్‌పై చేసిన కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు నోరెత్తడం లేదని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రస్తావన లేకుండా చేయడానికి ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని టీ-పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

About Author