టీ20 ప్రపంచకప్ షురూ! బోణి కొట్టిన ఒమన్
1 min readపల్లెవెలుగువెబ్, హైదరాబాద్: ఏడో టీ20 ప్రపంచకప్ కోసం సర్వం సిద్ధమైంది. యూఏఈ (UAE) వేదికగా 16దేశాలు, 45మ్యాచులతో నేటి నుంచి టీ20 ప్రారంభమయింది. టీ20 టోర్నీలో ప్రారంభ మ్యాచ్లో అతిథ్య జట్టు ఒమన్ బోణి కొట్టింది. ఆదివారం పపువా న్యూ గినియా(పిఎన్జి)జట్టుపై ఒమన్ జట్టు ఘన విజయం సాధించింది. పిఎన్జి 20ఓటర్లలో 9వికెట్లు కోల్పోయి 130పరుగులు చేసింది. అనంతరం ఒమన్ ఓపెనర్లు అకిట్ ఇలియాస్(50), జతిందర్సింగ్(73) చలరేగి ఆడి 14ఓటర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజయపథానికి చేర్చారు. రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్, స్కాట్ల్యాండ్ జట్లు తలపడతున్నాయి.
నవంబర్ 14 దాకా కొనసాగే టీ20 మ్యాచ్లను ఓమన్ (Oman), దుబాయ్ (Dubai), షార్జా (Sharjah)లలో నిర్వహించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో స్టేడియానికి 70 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించనున్నారు. ఈ మ్యాచ్ లు వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా కరోనా మార్గదర్శకాలు (Covid Protocall) పాటించాల్సి ఉంటుంది.