PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తైక్వాండో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ ప్రారంభo

1 min read

– తైక్వాండో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ ప్రారంభం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగర శివారులోని పెద్దపాడు వద్ద ఉన్న ఏపి మోడల్‌ స్కూల్‌లో జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో తైక్వాండో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ సిఇఒ పివి.రమణ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు విన్యాసాలు చేసి అకట్టుకున్నారు. అనంతరం జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ సిఇఒ పివి.రమణ మాట్లాడారు. జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కర్నూలు నగరానికి దూరంగా ఉన్న ఎపి మోడల్‌ స్కూల్‌లో తైక్వాండో.NIC కోచ్‌ జి.షబ్బీర్‌ హుసేన్‌. సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వేసవిలో పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. తైక్వాండో క్రీడ సాధన చేయడం వల్ల పిల్లల్లో మానసిక వికాసం, ఆత్మ విశ్వాసం పెంపొంతుందని తెలిపారు. ఈ క్యాంపునకు పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, క్యాంప్‌ ఇన్‌చార్జి రోహిత్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎపి మోడల్‌ స్కూల్‌ పిఇడి ఎస్‌.నాగమణి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author