తారక రామా నిన్ను మరువగలమా!
1 min read
బండి ఆత్మకూరు న్యూస్ నేడు: పేద బడుగు వర్గాల అభ్యున్నతి కొరకు సంక్షేమం కొరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎనలేని కృషి చేశారని తారకారాముని సేవలను పేద ప్రజలు ఎన్నడూ మరువలేరని బండి ఆత్మకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముమ్మడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102 వ జయంతి ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు కార్యకర్తల సమూహంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బస్టాండుకు చేరుకున్నారు. ఎన్టీఆర్ అమర్ హై అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బస్టాండులో ఏర్పాటుచేసిన నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి అధ్యక్షుడు ముమ్మడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చరిత్ర పుటల్లో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. మహిళలలో రాజకీయ చైతన్యానికి తెర లేపింది కూడా తారక రాముడే నని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వాటా కల్పించింది కూడా ఎన్టీఆర్ అని అన్నారు. తమిళనాడు వాసులకు తాగునీటిని అందించాలని లక్ష్యంతో వెలుగోడులో తెలుగు గంగ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అన్నారు.ఏ ముహూర్తాన తెలుగు ప్రారంభించారో కానీ కాలువ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగమైందని అన్నారు. ఏళ్ల తరబడి నుండి సాగునీరు లేక ఈ ప్రాంత రైతుల వేలాది ఎకరాల భూములు బీడుగా మారాయని అన్నారు. తెలుగు గంగ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత రైతుల బీడు భూములన్ని సస్యశ్యామలంగా మారి సాగుకు నోచుకున్నాయని అన్నారు. దీనివల్ల వెలుగోడు,మోత్కూరు బోయరేవుల, తో పాటు బండి ఆత్మకూరు మండలంలోని పెద్దదేవలాపురం, నారాయణపురం, చిన్నదేవులాపురం, ఈర్ణపాడు,కడమల కాలువ,సింగవరం సోమయాజులపల్లి, వెంగల్రెడ్డిపేట,గ్రామాలతో పాటు మహానంది మండలంలోని అనేక గ్రామాలలోని రైతుల భూములు సాగులోకి వచ్చాయన్నారు. గంగానీటితో చెరువులన్నీ నీటితో నింపుకొని రైతులు రెండు కార్లు వరి పంటను సాగు చేసి ఆర్థికంగా బాగుపడ్డారని అన్నారు. ఇందుకు కారణం ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చలవేనని అన్నారు. రైతులు నేడు నాలుగు మెతుకులు కడుపునిండా తింటున్నారంటే అందుకు కారణభూతుడు ఎన్టీ రామారావు అని ముమ్మడి కొనియాడారు. పేదల ప్రజల సంక్షేమం కొరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. రాబోవు రోజులలో తెలుగుదేశం పార్టీ బలపడేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. కార్యకర్తల సమిష్టి కృషితో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుదామని ముమ్మడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల సురేష్ రెడ్డి, మైనార్టీ నాయకుడు జాకీర్ ఖాన్, పాలసుబ్బారెడ్డి, మనోహర్ చౌదరి, చెన్నారెడ్డి,నాగేందర్ రెడ్డి, లింగాపురం హేమ సుందర్ రెడ్డి,బాబు,షఫీ, పరశురాం,సద్దాం,రసూల్, సింగవరం కలాం, మద్దిగారి భోపాల్, పాపయ్య,మల్లికార్జున, ఎల్లయ్య,శీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.