PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా టిడిపి అధినేత చంద్రబాబు జన్మదినం

1 min read

పల్లెవెలుగు వెబ్​ గడివేముల: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు 73వ జన్మదినం సందర్భంగా గురువారం నాడు గడివేముల టిడిపి మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల టిడిపి అధ్యక్షుడు మాట్లాడుతూ రాజకీయాలలో సంక్షేమ పాలన అందించడంలో చంద్రబాబు నాయుడు గారికి సాటి ఎవరు రారని అపర చాణక్యుడిగా పేరుపొందిన చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మరెన్నో పుట్టినరోజులు ప్రజల మధ్య జరుపుకునేలా వచ్చే ఎన్నికలలో వైసిపి పాలన అంతమై రాష్ట్రంలో టిడిపి పాలన రావాలని ఆకాంక్షించారు మరోసారి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేశం రమణారెడ్డి. దుబ్బ రమణారెడ్డి. శ్రీనివాస్ రెడ్డి. బాల.సంజీవరెడ్డి .మైనార్టీ నాయకుడు ఒండుట్ల గపూర్ . అవ్వారు శ్రీకాంత్. నాగన్న. టిడిపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author