కరోనతో టీడీపీ కార్పొరేటర్ మృతి
1 min read
పల్లెవెలుగు వెబ్: కరోనతో విశాఖపట్నం 31వ వార్డు కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతి చెందారు. కొన్ని రోజులుగా కరోన చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మృతి చెందారు. కరోనకు సంబంధించిన లక్షణాలు కనపడటంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆకస్మికంగా మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వానపల్లి రవికుమార్ ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపా తరపున గెలిచారు. ఆయన మరణంతో టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. రవికుమార్ మృతికి తెదేపా నేతలు సంతాపం తెలిపారు.