NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ మున్సిప‌ల్ చైర్మన్ అభ్యర్థి అరెస్ట్

1 min read

పల్లెవెలుగు, కడప;
క‌డ‌ప జిల్లా మైదుకూరు మున్సిప‌ల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థి ధ‌నపాల జ‌గ‌న్ ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనిని నిర‌సిస్తూ టీడీపీ నేత‌లు, ధ‌న‌పాల జ‌గ‌న్ కుటుంబ‌స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. ఈనెల 3న నామినేష‌న్ విత్ డ్రా స‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌ను సంబంధిత అధికారుల కార్యాల‌యంలోకి అనుమతించ‌డాన్ని నిర‌సిస్తూ అధికారుల‌ను నిల‌దీశారు ధ‌న‌పాల జ‌గ‌న్. దీనిపై ఎన్నిక‌ల అధికారి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్టేష‌న్ కు రావాల‌ని ధ‌న‌పాల జ‌గ‌న్ ను పిలిచారు. అయితే.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ పూర్తయ్యక వ‌స్తానని చెప్పినా పోలీసులు విన‌కుండా… శుక్రవారం రాత్రి అత‌నిని అరెస్టు చేశారు. అనంత‌రం వైద్యం ప‌రీక్షల నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు.

About Author