PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీ పొడి .. రూ. 2.5 లక్ష‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అసోమ్‌కు చెందిన రంజిత్‌ బారువా సరికొత్త టీ పొడిని తయారు చేశాడు. అసోం టీ తోటల్లో లభించే లేలేత తేయాకులకు పరిమిత మోతాదులో మేలిమి బంగారం, తేనె, బెల్లం, కోకో జోడించి ఆయన ఈ ‘స్వర్ణ పానం’ టీ పొడిని మార్కెట్‌ చేస్తున్నాడు. గౌహ‌తిలో జరిగిన ఇంటర్నేషనల్‌ టీ ఫెస్టివల్‌లోనూ ఆయన ఈ టీ పొడితో చేసిన టీని కొద్ది మందికి సర్వ్‌ చేశాడు. మంచి సువాసన, రుచితో కూడిన ఈ టీకి చాలా మంది ఫిదా అయిపోయారు. వంద గ్రాముల ప్యాక్‌ లో లభించే ఈ టీ పొడి ప్యాక్‌ కావాలంటే కొనుగోలుదారులు రూ.25,000 ఖర్చు చేయాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అసోమ్‌ టీకి మరింత విలువ జోడించాలనే ఆలోచనతోనే తాను ఈ ప్రయోగం చేసినట్టు బారువా చెప్పారు.

                          

About Author