PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైద‌రాబాద్ లో టీమిండియా మ్యాచ్.. టికెట్ ఎంతో తెలుసా ?

1 min read

పల్లెవెలుగుఎబ్ : చాలా విరామం త‌ర్వాత హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియం అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు వేదిక కానుంది. భార‌త్‌, ఆస్ట్రేలియాల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న టీ20 మ్యాచ్‌కు ఉప్ప‌ల్ స్టేడియం వేదిక కానుంది. టీమిండియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఈ నెల 20న భార‌త్‌కు ఆస్ట్రేలియా జ‌ట్టు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టీ20ని ఈనెల 25న టీమిండియా ఉప్ప‌ల్ స్టేడియంలో ఆడ‌నుంది. దాదాపుగా రెండేళ్ల త‌ర్వాత ఉప్ప‌ల్ స్టేడియంలో అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్ర‌యం రేపటి (సెప్టెంబరు 15) నుంచి మొద‌లు కానుంది. పేటీయం ఇన్‌సైడర్‌ (ఆన్‌లైన్‌) ద్వారా టికెట్లు అందుబాటులో ఉంటాయి.

                                

About Author