PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటి నుంచే టీమిండియా సిరీస్ ప్రారంభం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: వ‌రుస సిరీస్‌ల‌లో విజ‌యంతో దూకుడు మీద ఉన్న భార‌త క్రికెట్ జ‌ట్టు… రేప‌టి నుంచి ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడ‌నుంది. కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలో రేపు ఈ సిరీస్‌లో ప్రారంభ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇరు దేశాల జ‌ట్లు తిరువ‌నంత‌పురం చేరుకున్నాయి. రేపు తిరువ‌నంత‌పురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంట‌ర్నేష‌నల్ స్టేడియంలో రాత్రి 7 గంట‌ల‌కు తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్ అక్టోబ‌ర్ 2న గువాహటిలో జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత సిరీస్‌లో చివ‌రి టీ20 మ్యాచ్ ఇండోర్‌లో అక్టోబ‌ర్ 4న‌ జ‌ర‌గ‌నుంది. ఇటీవ‌లే ఆస్ట్రేలియా జ‌ట్టుతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో విక్టరీ సాధించిన టీమిండియా జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో సిరీస్‌లో ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగ‌నుంది.

                                      

About Author