NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తెలంగాణ .. జిల్లా అధ్య‌క్షుడు రేప్ చేశాడ‌న్న మ‌హిళా నేత‌ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణలోని నారాయణపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి పై ఓ మ‌హిళా నేత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శివ‌కుమార్ రెడ్డి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల తనను ఓ హోటల్‌కు పిలిపించి, మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చి, మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. సెల్‌పోన్‌లో తన నగ్న చిత్రాలు, వీడియోలను చిత్రీకరించి.. బ్లాక్‌మెయిల్‌ చేశాడని వాపోయారు. బాధితురాలు వివరాల ప్రకారం… బాధితురాలికి 2020 మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లాను కేటాయించారు. ఆ సమయంలో సదరు నాయకురాలికి నారాయణపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ప‌లుమార్లు త‌న పై అత్యాచారం చేసిన‌ట్టు బాధితురాలు పేర్కొంది. బాధితురాలు ఈ నెల 7న పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు శివకుమార్‌ రెడ్డిపై ఐపీసీలోని 417, 420, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

                                  

About Author